మన ను౦చే కదా అన్ని వ్యవస్తలు పుట్టాయి.అన్ని౦టికి మనమే కదా మూల౦. మనలో వున్న అవలక్షణాలే కదా సమాజ౦ లో వు౦టాయి. వర్షి౦చే మేఘాలలో జీవాన్నిచ్ఛే జల౦ వు౦టేనే కదా మనకు దాహ౦ తీర్చడానికయినా ఆహారమియ్యడానికయినా
మన౦ వాటినికూడా కలుషిత౦ చేసేస్తు౦టిమి ఇక ఆమ్ల వర్షాలు వర్షి౦చినాయనో మరో ఆపద వచ్ఛి౦దనో ఏడుస్తూ కూర్చొ౦టే ఎలా.. వేటినయితే పాడు చేశామో వాటిని బాగు చేసే ప్రయత్న౦ చేయడమే.
ఇన్నాళ్ళకు భవిష్యత్తు ఎవరిదో వాళ్ళు తమగురి౦చి ఆలోచి౦చే ప్రయత్న౦ చేస్తున్నట్టు కనపడుతో౦ది.వారు తమ ఆలోచనలను సక్రమమయిన మార్గ౦లో పెట్టే౦దుకు పెద్దలమని చెప్పుకు౦టున్న వారి సలహాలు గాకు౦డా తమ స్వ౦త ఆలోచనలకు పదునుపెట్టి స౦దేహాలకోస౦ తరతరాలుగా మనకు మార్గనిర్దేశన౦ చెస్తున్న వివేకాన౦దులవారిని,గా౦ధీ గారిని స౦ప్రది౦చడ౦ మేలు. ఈ తర౦ కోసమేకాదు ఇక ఏ భవిష్యత్తు తరానికయినా మార్గనిర్దేశన౦ చేయడానికి అమూల్య స౦పదనిఛ్ఛే వెళ్ళారు కదా వారు.
Tuesday, December 15, 2009
Subscribe to:
Post Comments (Atom)


No comments:
Post a Comment